KGF Chapter 2 2022 Telugu Movie Review

KGF 2

మూవీ రివ్యూ – Movie Review

యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “”కెజిఎఫ్‌ చాప్టర్-2”. “”కెజిఎఫ్‌ ” కి సీక్వెల్‌గా నిర్మించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరి నిరీక్షణకు తెరదించుతూ నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :




కెజిఎఫ్‌లో గరుడని చంపేసి రాఖీ భాయ్ (యశ్) కెజిఎఫ్ మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత స్టోరీగా కెజిఎఫ్ 2 మొదలయ్యింది. కెజిఎఫ్‌లో ప్రజలని తన సైన్యంగా చేసుకుని పాలిస్తున్న రాకీ భాయ్‌ని ఢీకొట్టేందుకు గరుడ నుంచి తప్పించుకు పారిపోయిన అధిరా (సంజయ్‌దత్) మళ్లీ కెజిఎఫ్ సామ్రాజ్యంలో అడుగుపెడతాడు. మరి రాఖీ, అధిరాకు మధ్య ఎలాంటి యాక్షన్ నడించింది, అధిరా తిరిగి రావడానికి కారకులు ఎవరు? ప్రధాన మంత్రిగా ఉన్న రవీనా టాండన్‌ కెజిఎఫ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు యశ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

కెజిఎఫ్ లో మాదిరిగానే కెజిఎఫ్‌ చాప్టర్ 2 లో కూడా రాక్ స్టార్ యశ్ ఎంట్రీ అదిరిపోయింది. యశ్ స్టైలిష్ నటన, డైలాగ్ డెలివరీ మరోమారు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక ఈ సారి మెయిన్ విలన్‌గా చేసిన సంజయ్ దత్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా మరియు ఒకింత భయానకంగా అనిపించింది. ఇప్పటివరకు సంజయ్ దత్ చేసిన క్యారెక్టర్స్‌లో ఇది ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తమ తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారు.

ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి అద్భుతం సృష్టించాడు. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఎన్నో ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఎలివేషన్స్ అన్నీ కూడా కెజిఎఫ్‌ని మించి చూపించాడు. మాస్ సీన్స్, చివరి వరకు ఎమోషన్స్ను బాగా క్యారీ చేయడం, అమ్మ సెంటిమెంట్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ గూస్బంప్స్ వంటివి చక్కగా అనిపించాయి.

మైనస్ పాయింట్స్ :




మెయిన్ కథలోకి రావడానికి దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా గడవడం, ఇక అసలు కథలోకి వచ్చాక కాస్త అక్కడక్కడ కథ నెమ్మదిగా సాగడం, మరీ ఎలివేషన్ సీన్స్ కాస్త పెరిగినట్టుగా అనిపించాయి.

ఇక ఉన్న కథనే కాస్త ఎక్కువగా సాగదీయడం కూడా డ్రా బ్యాక్ అయ్యిందని తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ మరియు సెంటిమెంట్ సీన్స్ ఎక్కువయ్యాయి. ఒకటి రెండు చోట్ల తప్పా సప్సెన్స్, థ్రిల్ అనేవి ఎక్కడా కనిపించవు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక విభాగం గురుంచి మాట్లాడుకుంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2ని కెజిఎఫ్‌కి మించి తెరకెక్కించాడనే చెప్పుకోవాలి. ఎలివేషన్స్, స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌, యాక్షన్స్ సీన్స్‌ ఇలా ఏ అంశంలోనూ ప్రశాంత్ నీల్ తగ్గలేదు.

ఇక దీనికి తోడు రవి బసృర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఇవ్వలేదని చెప్పాలి. మెయిన్ సినిమాకి ఇదే హైలెట్. ఇక కొన్ని ఎలివేషన్ షాట్స్‌కి ప్రకాశ్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బాగా సూట్ అయ్యిందని చెప్పొచ్చు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నటైతే కెజిఎఫ్ చాప్టర్ 1 కంటే మించిన అంచనాలతో వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 ఏ మాత్రం అందుకు తగ్గలేదని చెప్పాలి. యశ్ నటన, యాక్షన్ సీన్స్, సంజయ్ దత్ పవర్‌ఫుల్ విలనిజం అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే కొంచెం కథను సాగదీసినట్టు అనిపించినా, యాక్షన్ మరియు సెంటిమెనెట్ సీన్స్ ఎక్కువయ్యాయి అన్న వాటిని పక్కన పెడితే కెజిఎఫ్ చూసిన వారికే కాకుండా మాస్ మరియు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే చెప్పాలి.

English Review