Bedurulanka 2012 (2023) Telugu Movie Review

Bedurulanka 2012

బెదురులంక 2012 మూవీ రివ్యూ – Bedurulanka 2012 Movie Review

యూత్ హీరో కార్తికేయ, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వం లో తెరకెక్కిన బెదురులంక 2012 చిత్రం నేడు థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ :

హీరో శివ శంకర వర ప్రసాద్ అలియాస్ శివ (కార్తికేయ) సినిమాలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ ను వదిలేసి, తన సొంత గ్రామం అయిన బెదురులంక కి వెళ్తాడు. అక్కడ తను చిత్ర (నేహా శెట్టి )తో ప్రేమలో పడతాడు. 2012 లో యుగాంతం అని టీవీ ఛానెల్స్ లో న్యూస్ చూస్తూ గ్రామ ప్రజలు భయాందోళన లో ఉంటారు. అయితే ఆ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక బాబా(శ్రీకాంత్ అయ్యంగార్), పాస్టర్ (ఆటో రామ్ ప్రసాద్) లను అడ్డం పెట్టుకుంటాడు అజయ్ ఘోష్. అజయ్ ఘోష్ వేసిన ప్లాన్ సినిమాలో చాలా ఫన్ మరియు డ్రామా ను క్రియేట్ చేయడం జరిగింది.

అయితే ఎలాంటి మూడ నమ్మకాలు నమ్మని హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తను ప్రేమించిన చిత్రను పెళ్లి చేసుకున్నాడా? యుగాంతం కాన్సెప్ట్ కారణం గా బెదురులంక లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి కథ చాలా ప్లస్ అయ్యింది. యుగాంతం కాన్సెప్ట్ ద్వారా వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ స్టార్టింగ్ నుండి ఎంటర్ టైనింగ్ గా సాగింది. హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా శెట్టి ల నటన బాగుంది. వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై ఆకట్టుకుంది. సినిమాలో కీలక పాత్రల్లో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, గెటప్ శ్రీను లు బాగా నటించారు. ఇతరుల నటన కూడా సినిమాకి ప్లస్ గా మారింది.

సెకండ్ హాఫ్ లో వచ్చే సత్య, వెన్నెల కిషోర్ ల సన్నివేశాలు ఆడియెన్స్ ను అలరిస్తాయి. చివరిలో యుగాంతం కాన్సెప్ట్ తో వచ్చే డ్రామా నవ్వులతో పాటుగా, ఆలోచింప చేసేలా ఉంటాయి. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మంచి సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాకి మణిశర్మ మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయ్యింది. సినిమాలో మూడ నమ్మకాలు ఎలా మనుషుల్ని మారుస్తాయి అనే దానిపై చక్కటి సన్నివేశాలు చూపించారు.

మైనస్ పాయింట్స్ :

సినిమా లో కాస్త నాటకీయత ఎక్కువగా ఉంది. కొన్ని సన్నివేశాలు అనవసరం గా కథ కి జోడించినట్లు అనిపిస్తుంది. కథలో హీరో హీరోయిన్ ల మధ్యన వచ్చే లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ, తర్వాత వచ్చే సన్నివేశాలు ముందుగానే మనం ఊహించవచ్చు. రెగ్యులర్ గా సాగే రోటీన్ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. సినిమాను మరింత ఆసక్తికరంగా ఉంచేందుకు ఇంకాస్త బెటర్ స్క్రీన్ ప్లే ఉండే అవకాశం ఉంది.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాను తను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. యుగాంతం కాన్సెప్ట్ ను ఉపయోగించి మనిషి లో ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నం చేశారు. హీరో కార్తికేయ, హీరోయిన్ నేహా శెట్టి ల పర్ఫార్మెన్స్ బాగుంది.

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు, సన్నీ కూరపాటి ల సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మొత్తమ్మీద బెదురులంక 2012 ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. హీరో కార్తికేయ, హీరోయిన్ నేహ శెట్టి ల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అయితే రొటీన్ సన్నివేశాలు, ముందుగా ఊహించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. ఇవి సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించాయి. సెకండ్ హాఫ్ లో కామెడీ డోస్ ఎక్కువగా ఉంది. అయితే కథనం ముందుగానే ఊహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. ఇవి ఆడియెన్స్ కి ఆసక్తిని తగ్గిస్తాయి. రొటీన్ కామెడీ చిత్రాలని ఆస్వాదించే వారు ఒకసారి చూడవచ్చు.

English Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *