Tiger Nageswara Rao (2023) Telugu Movie Review

Tiger Nageswara Rao

మూవీ రివ్యూ టైగర్ నాగేశ్వరరావు

చిత్రం : టైగర్ నాగేశ్వరరావు
తారాగణం : రవితేజ, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాసర్, మురళీ శర్మ
రచయిత మరియు దర్శకుడు: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సహ నిర్మాతలు: మయాంక్ సింఘానియా, అర్చన అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పకుడు: తేజ్ నారాయణ్ అగర్వాల్
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
కొరియోగ్రాఫర్: శేఖర్ VJ
ఫైట్ మాస్టర్స్: రామ్ లక్ష్మణ్
విడుదల తేదీ : 20 అక్టోబర్ 2023

ర‌వితేజ హీరోగా వచ్చిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా దొంగతనాలే వృత్తిగా బతుకుతూ ఉంటారు. వారి ఆకలిని, అవసరాలను అవకాశంగా చేసుకుని.. అక్కడి అధికారులంతా వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ వారిని అణిచివేస్తారు. అవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు (రవితేజ) వాటి పై ఎలాంటి పోరాటం చేశాడు?, తన స్టూవర్టుపురం ప్రజల బాగు కోసం ఏం చేశాడు ?, ఈ క్రమంలో స్టూవర్టుపురం నాగేశ్వరరావు నుంచి టైగర్ నాగేశ్వరరావుగా ఎలా రూపాంతరం చెందాడు ?, ఈ మధ్యలో నాగేశ్వరరావు యుక్త వయసులో ఉన్నప్పుడు సారా (నుపుర్ సనన్) తో ఎలా ప్రేమలో పడ్డాడు ?, చివరకు టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ?, ఇంతకీ నాగేశ్వరరావు తాను అనుకున్నది సాధించాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

స్టూవర్టు పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయించి, తన వాళ్లకు జీవితాన్ని ఇచ్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా నడిచిన ఈ కథలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషన్స్, అలాగే సాహసోపేతమైన దోపిడీ సన్నివేశాలు మరియు నటీనటులు పనితనం ఆకట్టుకుంది. రవితేజ తన కెరీర్ లో ఒక ఛాలెంజ్ గా ఈ పాత్రలో నటించిన విధానం మెప్పిస్తుంది.

తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో రవితేజ కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని చోట్ల సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు మరియు ఆమె నటన బాగుంది.

మరో హీరోయిన్ గా చేసిన గాయత్రి భరద్వాజ్ కూడా మెప్పించింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్‌ ఒదిగిపోయింది. అనుపమ్ ఖేర్, నాజర్, మురళీశర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జిస్సు సేన్‌గుప్తా మరో ముఖ్యమైన పాత్రలో చాలా బాగా నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. కొన్ని కీలక సన్నివేశలను దర్శకుడు వంశీ చాలా బాగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

టైగర్ నాగేశ్వరరావు లో మెయిన్ కంటెంట్ అండ్ రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ బాగున్నా.. ట్రీట్మెంట్ విషయంలో కొన్ని చోట్ల బాగా స్లో అనిపించింది. దీనికితోడు దర్శకుడు వంశీ కథనం విషయంలో రాజీపడకుండా ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు.

అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. అలాగే 1970 – 80వ దశకంలో కథ సాగుతున్నప్పుడు అప్పటి నేటివిటీని దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలను చిత్రీకరించి ఉంటే బాగుండేది. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్రను మొదట్లో చూపించిన ఎలివేషన్స్.. దర్శకుడు సినిమా మొత్తం సస్టైన్ చేయలేకపోయాడు. ఇక మధ్య మధ్యలో వచ్చే ప్రేమ సన్నివేశాలు కథ ప్లోకి అడ్డు పడ్డాయి.

సాంకేతిక విభాగం :

మంచి కథను తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు వంశీ. కానీ, ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో, దాన్ని ఇంకా ఉత్కంఠభరితంగా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేక పోయాడు. ఇక సినిమాకు పనిచేసిన సాంకేతిక టీమ్ పనితనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా సాంకేతిక వర్క్ సాగింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం పర్వాలేదు.

కాకపోతే, ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు పనితనం బాగుంది. ఆర్. మధి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకునేలా సాగింది. ఎక్కడా బ్యూటీ తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు ఆయన. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

టైగర్ నాగేశ్వరరావు అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. రవితేజ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్స్, మరియు కొన్ని డెప్త్ ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లో గా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ అండ్ రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోవడం మరియు కొన్ని ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

ఓవరాల్ గా కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.

English Review