Gang Leader 2019 Telugu Movie Review

Gang

గ్యాంగ్‌ లీడర్‌ మూవీ రివ్యూ ఆడియో – Gang Leader Movie Review Audio




 

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

పెన్సిల్ పార్ధ సారథి (నాని) సినిమాలు చూసి నవల్స్ రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరకి ఓ ఐదుగురు ఆడవాళ్లు ఓ వ్యక్తిని చంపాలని.. దానికి సాయం చేయాలని కోరతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ ఆడవాళ్ల గ్యాంగ్ లీడర్ గా నాని మారతాడు. ఈ గ్యాంగ్ అంతా కలిసి దేవ్ (కార్తికేయ) చంపాలని ప్రయత్నం చేస్తారు. అసలు వీళ్ళు దేవ్ ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? దేవ్ కి వీళ్ళకి సంబంధం ఏమిటి ? చివరికి దేవ్ ని చంపారా? లేదా? ఇంతకీ నాని ఆ ఆడవాళ్లకి ఎందుకు సాయం చేస్తున్నాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

పర్ఫెక్ట్ హిట్ కోసం నాని ఎంచుకున్న ఈ ‘గ్యాంగ్ లీడర్’ రివెంజ్ కామెడీ డ్రామాగా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సినిమాలో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇక మ్యూజిక్ సంచలనం అనిరుధ్ ఈ సినిమాకి అందించిన సంగీతం మరియు హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ అలాగే ఓపెనింగ్ యాక్షన్ సన్నివేశం బాగా ఆకట్టుకుంటాయి.

పెన్సల్ పార్ధ సారథి అనే పాత్రలో నాని తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే రేసర్ గా కనిపించిన కార్తికేయ కూడా బాగా నటించాడు. లక్ష్మీ, శరణ్య.. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు మరియు వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.




మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. ఆ తరువాత కథనం నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లోని ఆ కొంచెం ల్యాగ్ ను కథనం నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడుతోంది.

మొత్తంగా దర్శకుడు మంచి కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. కొన్ని సన్నివేశాల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు. ముఖ్యంగా కార్తికేయ పాత్రకి సంబదించి ఇంకా క్లారిటీగా చూపించి ఉంటే బాగుండేది. అలాగే సినిమాలో ఉన్న బలమైన ఎమోషనల్ రివేంజ్ కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికితోడు సెకెండ్ హాఫ్ లో హీరో చుట్టూ సాగే డ్రామా ఇంకా బలంగా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ప్రేమ సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

తీర్పు :

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ఈ కామెడీ రివేంజ్ డ్రామా సరదాగా మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ స్ కి ముందే సీన్స్ స్లోగా సాగుతాయి. ఐతే నాని తన కామెడీ టైమింగ్ తో సినిమాలో బాగా అలరించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

English Review