Choosi Chudangane 2020 Telugu Movie Review

Choosi

చూసీ చూడంగానే మూవీ రివ్యూ – Choosi Chudangane Movie Review




శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటించగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం




కథ :

సిద్ధూ (శివ) తన మదర్ (పవిత్రా లోకేష్) కారణంగా తనకు నచ్చినట్టు ఉండలేకపోతాడు. చదువు కూడా మదర్ చెప్పిందే చదువుతూ తానూ కోరుకున్నట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకోలేకపోతాడు. అలా తనకు ఇష్టం లేకుండానే బి.టెక్ లో జాయిన్ అవుతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీశన్)తో ప్రేమలో పడతాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాక ఐశ్వర్య సిద్ధూకి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తరువాత మూడేళ్లు గడిచాక సిద్ధూ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా లైఫ్ ని లీడ్ చేస్తోన్న క్రమంలో అతని జీవితంలోకి శ్రుతి రావ్ (వర్ష బొల్లమ్మ) వస్తోంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికి ఒక్కరూ చెప్పుకునే ప్రొసెస్ లో సిద్ధూకి శ్రుతి గురించి ఒక నిజం తెలుస్తోంది. ఆమె కాలేజీ నుండే తనని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. తనని ప్రేమిస్తోన్నా శ్రుతి ఆ విషయం సిద్ధూకి ఎందుకు చెప్పదు ? శ్రుతికి ఐశ్వర్యకి మధ్య రిలేషన్ ఏమిటి ? వారి మధ్య సిద్ధూకి సంబంధించి జరిగిన గొడవ ఏమిటి ? చివరకి సిద్ధూ – శ్రుతి ఎలా ఒక్కటి అవుతారు ? ఈ మధ్యలో వారిద్దరి ప్రేమ కథలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమా పేరులోనే ‘చూసీ చూడంగానే’ ఉన్నట్లు.. ఈ సినిమా ప్రేమ కథ కూడా’చూసీ చూడంగానే’గానే పుట్టిన ఎమోషన్ అండ్ లవ్ ఫీలింగ్ చుట్టే తిరుగుతూ కొన్ని లవ్ సీన్స్ తో పాటు కొన్ని చోట్ల డీసెంట్ కామెడీతో బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కందుకూరి తన పాత్రకు తగ్గట్లు.. ప్రేమ సన్నివేశాల్లో బాగా నటించాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాధతో లోలోపలే నలిగిపోతున్న ఎక్స్ ప్రెషన్స్ తో పాటు తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో, అలాగే తనకు తన తల్లి పాత్రకి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో కూడా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా శివ నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన మాళవికా సతీశన్ నటన కూడా బాగుంది. హీరోకి ఫ్రెండ్ గా నటించిన నటుడు కూడా తన కామెడీ టైమింగ్ తో తానూ కనిపించిన ప్రతి సీన్ లోనూ ఆయన అలరిస్తారు. తండ్రి పాత్రలో కనిపించిన అనీష్, మరియు తల్లి పాత్రలో నటించిన పవిత్రా లోకేష్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

దర్శకురాలు శేష్ సింధూ రావ్ రాసుకున్న లవ్ సీన్స్ తో పాటు కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. అలాగే మెయిన్ గా.. హీరో -హీరోయిన్ క్యారెక్టర్ల చుట్టూ అల్లుకున్న డ్రామా (కొన్ని చోట్ల స్లోగా ఉన్నప్పటికీ) కూడా బాగుంది. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.




మైనస్ పాయింట్స్ :

సినిమా ఇంట్రస్టింగ్ గానే మొదలైనా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. ఇక హీరో హీరోయిన్ ల క్యారెక్టర్స్ మధ్య లవ్ ఎమోషన్ ను సెకెండ్ హాఫ్ లో బాగా ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ వారి లవ్ స్టొరీలో కాన్ ఫ్లిక్ట్ ను బలంగా ఎలివేట్ చేయలేకపోయారు. దీనికి తోడు మొత్తానికి ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు.

ఇక హీరో క్యారెక్టర్ కూడా ముందు నుంచి పాసివ్ గా స్టార్ట్ అయి.. ఎండింగ్ వరకూ అలాగే సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్ ఆర్క్ ఇంకా బలంగా ఉండాల్సింది. పైగా చివరివరకూ తన ప్రేమ విషయంలో హీరోకిపూర్తి క్లారిటీ రాకపోవడం అలాగే ముందు ప్రేమించిన అమ్మాయి ఎలాంటిదో కూడా తాను అర్ధం చేసుకోలేకపోవడం వంటి విషయాల్లో కాస్త సినిమాటిక్ అనిపిస్తోంది.

అయితే దర్శకురాలు రాసుకున్న కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో మెయిన్ ప్లాట్ కూడా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగడంతో.. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది. హీరో పాత్రలో ఎమోషనల్ డ్రామా చాలానే ఉన్నా.. అది పూర్తి స్థాయలో ఆకట్టుకోకపోవడంతో ఆ ఎమోషన్ కి ఆడియన్ అవ్వాల్సిన స్థాయిలో ఇన్ వాల్వ్ అవ్వరు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. గోపిసుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని కాస్త స్లోగా సాగే సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత రాజ్ కందుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకురాలు శేష్ సింధూ రావ్ రైటింగ్ పరంగా జస్ట్ ఒకే అనిపించినా కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకుంది.

తీర్పు :

‘చూసీ చూడంగానే’ ఒక అమ్మాయి ఒక అబ్బాయిను చాల స్వచ్ఛమైన హృదయంతో ఫ్యూర్ గా ప్రేమిస్తే.. ఆ అబ్బాయి మాత్రం వేరే అమ్మాయి వెంట తిరుగుతూ ఉంటే.. చివరికి వీరిద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేని సిచ్యుయేషన్ కి వస్తే.. ఇంతకి ఎలా వచ్చారు అనే కోణంలో సాగిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఎమోషనల్ సాగే లవ్ ట్రాక్ అండ్ కొన్నిచోట్ల డీసెంట్ కామెడీతో అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్, కొన్ని చోట్ల బోరింగ్ ప్లే అండ్ బలమైన సంఘర్షణ లేకపోవడం సినిమా ఫలిత్తాన్ని దెబ్బ తీసింది. కానీ, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అండ్ వర్ష బొల్లమ్మ నటన సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ ‘రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్’ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. మరి ఈ చిత్రాన్ని మిగిలిన వర్గాల ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

English Review