Agent Sai Srinivasa Athreya 2019 Telugu Movie Review

Agent

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ రివ్యూ ఆడియో – Agent Sai Srinivasa Athreya Movie Review Audio





 

నవీన్ పోలిశెట్టి,శృతి శర్మ ప్రధాన పాత్రలలో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ ఎలావుందో ఇప్పుడు పరిశీలిద్దాం.

కథ :

ఆత్రేయ(నవీన్ పోలిశెట్టి) నెల్లూరు కేంద్రంగా చిన్నాచితకా కేసులను పరిష్కరించే, అంతగా పేరులేని ఓ డిటెక్టీవ్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ పెద్ద కేసుని ఇన్వెస్టిగేట్ చేసి మంచి పేరు తెచ్చుకొని జీవితంలో స్థిర పడాలి అని ఎదురుచూస్తున్న ఆత్రేయకు అనుకోకుండా ఒకరోజు రైలు పట్టాల ప్రక్కన అనుమానాదాస్పద స్థితిలో శవంగా మారిన ఓ యువతి కేసును ఛేదించే అవకాశం దక్కుతుంది. దానితో ఆ యువతి మరణం వెనుక వున్న వాస్తవాలను ఛేదించే దిశగా ఆత్రేయ తన విచారణ మొదలు పెడతాడు. ఆ యువతిని చంపిన ఆ నేరస్తులు ఎవరు? ఈ కేసులోని చిక్కుముడులను ఆత్రేయ ఎలా ఛేదిస్తాడు? అనేది అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీకి ప్రధాన బలం దర్శకుడు మూవీ కొరకు ఎంచుకున్న సబ్జెక్టు. కనిపించకుండా పోయి శవమై తేలిన వ్యక్తులకు సంబందించిన కేసును ఒక చిన్న డిటెక్టీవ్ ఛేదించిన విధానం కొత్తగా ఉంది.

హీరోగా నవీన్ కి మంచి ఆరంభం లభించిందని చెప్పాలి. వైవిధ్యం తో పాటు భిన్న కోణాలున్న తన పాత్రను చక్కగా పోషించాడు. హాస్యసన్నివేశాలలో తో పాటు సీరియస్ సన్నివేశాలలో కూడా అతని నటన కట్టిపడేసేలా ఉంది.

హీరోకి అన్నివేళలా తోడుగా ఉంటూ తన ఇన్వెస్టిగేషన్ లో తన వంతు సాయం చేసే అసిస్టెంట్ పాత్రలో హీరోయిన్ శృతి శర్మ యాక్టింగ్ బాగుంది. ఇక ప్రధాన పాత్రలలో కనిపించిన మిగతా నటులందరూ కొత్తవారైనప్పటికీ తమ పరిధిలో వారు నటించి మెప్పించారు. చివరి 10నిమిషాల వరకు కూడా కథలో సస్పెన్సు క్యారీ ఐయ్యేలా కథనం చక్కగా కుదిరింది.

సినిమాలోని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరో అదనపు ఆకర్షణ, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. హాస్య సన్నివేశాలలో నవీన్ నటన ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు నవీన్ పై తెరకెక్కిన కామెడీ సన్నివేశాలను ని బాగా ఎంజాయ్ చేస్తారు. చిత్రీకరణకు ఎంచుకున్న ప్రదేశాలు,అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంప్రెస్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్ :

చివరి 15నిమిషాలు డైరెక్టర్ కథను సాగదీశాడనిపిస్తుంది. కథలో అసలు ట్విస్ట్ తెలిసిపోయాక కూడా అనవసర సన్నివేశాలతో మూవీ నెమ్మదించేలా చేశాడు.
చాల సన్నివేశాలు సాగదీతలా అనిపించడంలో ఎడిటింగ్ వైఫల్యం కనపడుతుంది. ఒక పది నిమిషాల అనవసర నిడివి తగ్గిస్తే ఇంకా సినిమా బాగుండేది.

కేసుల విషయంలో పోలీసులు అంతగా పేరులోని ఓ చిన్న ఏజెంట్ ఆత్రేయ హెల్ప్ తీసుకోవడం అనేది కొంచెం నమ్మబుద్ది కాదు, వాస్తవికతకు అంతగా దగ్గరగా అనిపించదు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరక్కెక్కించారు. అద్భుతమైన విజువల్స్ కెమెరామెన్ పనితనాన్ని తెలియజేస్తాయి. అలాగే సందర్భానుసారంగా వచ్చే డైలాగులు,సన్నివేశాలకు ఫీల్ తెచ్చేలా బి జి ఎం బాగా కుదిరాయి. మూవీ లైటింగ్ ఉత్కంఠ రేపే సన్నివేశాలకు వన్నెతెచ్చేలా ఉంది.

ఇక డైరెక్టర్ స్వరూప్ మొదటి సినిమాతోనే తన టాలెంట్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించారు. కష్టతరమైన థ్రిల్లింగ్ స్టోరీని అర్ధమయ్యే విధంగా తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ప్రతి సన్నివేశాన్ని సునిశిత పరిశీలనతో తెరకెక్కించినట్లు ఉంది. చివరి 15నిముషాలు మినహాయిస్తే సినిమా ఆసాంతం ఉత్కంఠ కలిగేలా కథనం నడిపాడు. ఈ మూవీ చూశాక టాలీవుడ్ కి ఓ మంచి దర్శకుడు దొరికాడని భావన రాక మానదు.

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” ఆసక్తి కరమైన కథనంతో సాగే ఉత్కంఠ రేపే ఓ మంచి కామెడీ థ్రిల్లర్. ఆకట్టుకునే నటనతో పాటు, మంచి డైలాగ్ డిక్షన్తో నవీన్ పోలిశెట్టి హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి ప్రభావం చూపాడు. వాస్తవికతకు దగ్గరగా ఉండే ఆసక్తికరమైన కథనం ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. చివరి 10నిమిషాలు మినహాయించి , ప్రేక్షకుడికి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ వారాంతపు సెలవులు ఓ మంచి మూవీతో ముగించాలనుకునే వారికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ బెస్ట్ చాయిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Release date : 21 June 2019

Teluguprazalu.com Rating : 3.25/5

Starring :  Naveen Polishetty,Shruti Sharma, Suhas

Director :  Swaroop RSJ

Producers :  Rahul Yadav Nakka

Music Director :  Mark K Robin

Cinematographer :  Sunny Kurapati

Editor :  Amit Tripathi




Agent Sai Srinivasa Athreya is a film which is making a lot of noise all over. Starring Naveen Polishetty, this film has released today. Let’s see how it is.

Story :

Athreya(Naveen Polishetty)is a small time detective agent in Nellore who is looking for one big case to make it big in his career. One fine day, he comes across the case of a dead body which has been abandoned near a railway track. Athreya starts his investigation and comes to know that these bodies which are being found have a criminal connection. Rest of the story is as to how Athreya goes in detail and cracks this case.

Plus Points :

One of the biggest strengths is the subject that has been used for this thriller. The missing cases of dead bodies and how a small time detective gets into it has been thought of well and looks quite novel.

Naveen Polishetty makes a solid debut and has a lot of potential. His role demanded a lot of variations and fun which had to be done with a straight face and Naveen was pretty good in his role. He cracks up with good comedy and is also very impressive in all his serious scenes.

Heroine Shruthi Sharma also played her role well and gave good support to the hero. The supporting cast is new but they were on the spot. The manner in which all the twists are revealed is very good. The suspense factor has nicely been built up till the last ten minutes.

The investigation scenes and how the film is brought to the interval point looks good. Also, the hero’s character is given a comedy angle and that created some decent fun in the film. The locations and production values of the film need a special mention as the film looks appealing throughout.

Minus Points :

The director drags the film a bit in the last 15 minutes. The suspense is broken by then and just to nab the criminals, the director added many scenes which make the film slow.

The film needs some editing as many scenes look long. If it is trimmed by ten minutes things will be very impressive for the audience.

Also, things look a bit over the top in certain scenes when a small time agent like Athreya easily takes the help of a cop and does his investigation in his own and easy manner.

Technical Aspects :

As told earlier, the film is technically sound. The camera work is top notch as the visuals look arresting. The dialogues are good and so was the sound design and background score. The film’s lighting is also apt and brings a lot of seriousness to the proceedings.

Coming to the director Swaroop RSJ, he has done a impressive job with the film. It’s very hard to narrate a thriller with good twists and Swaroop has done well with his taut narration. Special mention should go to his detailing which is top class. Every aspect in the case is showcased well and creates a good suspense factor. He is surely a talent to watch out for and if he would have made the last fifteen minutes crisp, things would have been even better. Nevertheless, his way of handling the thriller is quite good.

Verdict :

On the whole, Agent Sai Srinivasa Athreya is an impressive thriller which has good suspense and taut narration. Naveen Polishetty makes an impact with his lovable performance. Realistic approach and interesting screenplay keeps the viewers engaged. Apart from the slightly dragged last ten minutes, this film has several aspects to make it a gripping watch this weekend. Recommended.